"విద్యార్థులకు ఉపయోగం లేని బైజూస్​ కంటెంట్ - ఉపాధ్యాయ పోస్టుల భర్తీతోనే నాణ్యమైన విద్య"

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 9, 2024, 3:42 PM IST

thumbnail

Student Unions Agitation on Byjus APP: రాష్ట్ర ప్రభుత్వం బైజూస్​తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్​యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో భాగంగా అరండల్​పేట లోని బైజూస్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవటంతో అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు బైజూస్​ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. 

దివాలా తీస్తున్న బైజూస్ సంస్థకు అప్పనంగా వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్​కు ఏటా రూ 3200 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుందని వారు ఆరోపించారు. కంటెంట్ లేని బైజూస్ తో ఒప్పందం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బైజూస్ యాప్​లోని కంటెంట్ ద్వారా విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తేనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.