SC ST Employees JAC Agitation in Vijayawada on Reservations: సమస్యలు పరిష్కరించకుంటే.. సీఎం క్యాంప్​ ఆఫీసు ముట్టడిస్తాం: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 5:12 PM IST

thumbnail

AP SC ST Employees JAC Agitation in Vijayawada on Reservations In Promotions: రాష్ట్రంలో అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగం కాకుండా.. వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో కల్పించే రిజర్వేషన్​ను తొలగించాలని చూస్తోందని మండిపడ్డారు. అందుకోసమే మిడిల్​ లెవెల్​ ఆఫీసర్స్​ కమిటీని నియమించిందని.. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ టీచర్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇరు సంఘాల నేతలు విజయవాడ ధర్నా చౌక్​లో ఆందోళనకు దిగారు. 

ప్రభుత్వం తక్షణమే చర్చలకు చర్యలు తీసుకుని.. తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కానీ​సీక్వెన్షియల్​ సీనియారిటీని అమలు చేయాలని.. మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు. ఆర్​అండ్​బీ శాఖలో ఎంపవర్డ్​ కమిటీ నివేదికను అమలు చేయాలన్నారు. నీటి పారుదల శాఖలో సీనియర్లకు ఎఫ్​ఏసీ లేదా ఇంచార్జీలుగా అవకాశం ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించటానికి సైతం వెనకాడేది లేదని తెల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని హెచ్చరించారు. 

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.