'సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి - ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలి'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 5:12 PM IST

thumbnail

Round table meeting on State special status: 'ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు' పేరుతో గుంటూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ రాజకీయ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మాని.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలని డిమాండ్ చేశారు.

MLC Lakshmana Rao Comments: ఆంధ్రా మేథావుల ఫోరం, ప్రత్యేక హోదా సాధన యువజన ఐకాస ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఆంధ్రా మేథావుల ఫోరం అధ్యక్షుడు, జనచైతన్య వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ..''రైల్వేతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. ఏపీకి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు గట్టిగా అడగటం లేదు..?, ప్రతిపక్షాలు కూడా కేంద్రంలోని బీజేపీని ఎందుకు నిలదీయడం లేదు..?. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదు. రాబోయే ఎన్నికల్లో పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధం కావాలి. ఏపీ హక్కుల విషయంలో సీఎం జగన్ రాజీపడటం సరికాదు. విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మాని.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలి.'' అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.