Road Accident Several Dead: నంద్యాల జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఘటనస్థలంలోనే ఇద్దరు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 4:37 PM IST

thumbnail

Road Accident Several Dead: నంద్యాల జిల్లా బేతంచెర్ల ఘాట్‌రోడ్‌లో వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. బేతంచెర్ల నుంచి పలుకూరు వైపు ఐదుమంది కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుడంగా.. గోర్లగుట్ట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీరందరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరోవైపు.. పల్నాడు జిల్లా కారంపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యకు పురిటినెప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యం కోసం డబ్బు తెచ్చేందుకు వెళ్లిన భర్త.. తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వైద్యం కోసం డబ్బులు తెస్తానని ఇంటికి వెళ్లిన భర్త ఆనంద్‌.. తిరిగి వస్తుండగా గుంతల రోడ్డులో బైక్‌పై నుంచి పడి మరణించాడు. మూడు గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన గర్భిణి.. పాపను ప్రసవించే సమయానికి భర్త మృతదేహం నరసరావుపేట ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.