Protest at EX-Minister ShankarNarayana Home : రగిలిన పేదల గుండెలు..! మాజీ మంత్రి ఇంటి ఎదుట మహిళల ధర్నా.. పోలీసుల బలప్రయోగం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 5:41 PM IST

thumbnail

Protest at EX-Minister ShankarNarayana Home in Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో ప్రజలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాజీ మంత్రి శంకరనారాయణ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్న చోట వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Police Stopped the Protesters in AP : వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో... ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను మూడు రోజుల క్రితం రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించారు. గుడిసెలు తొలగించినందుకు నిరసనగా వ్యవసాయ కార్మిక సంఘం, నిర్వాసితులు మాజీ మంత్రి శంకరనారాయణ ఇంటి బయట కూర్చొని ఆందోళన చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్ అస్వస్థతకు గురయ్యారు. అతడిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పలువురు పేదలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.