Prathipati Pulla Rao On Jagan Government Harassment: ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపినందుకే... మార్గదర్శిపై దాడి: ప్రత్తిపాటి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 5:00 PM IST

thumbnail

Prathipati Pulla Rao On Jagan Government Harassment: పాదయాత్ర అంటే కోర్టు వాయిదాల పేరు చెప్పి వారానికి రెండు రోజులు సెలవు తీసుకోవడం కాదని.. జగన్ పాదయాత్ర గురించి జనాలకు తెలియంది ఏమీ లేదని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. గతంలో జగన్ రిలే పాదయాత్ర చేశారని, ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. లోకేశ్ పాదయాత్ర బ్లాక్‌బస్టర్‌ అయిందని.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని.. అలుపెరగకుండా నిర్విరామంగా నడుస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని ప్రత్తిపాటి వెల్లడించారు. సీఎం జగన్ వైఫల్యాలను ఎండగడుతూ సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతుంటే వైసీపీ నాయకులు నోరు మెదపలేకపోతున్నారని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

లోటస్‌పాండ్‌లో పడుకుంది నిజం కాదా?:   జగన్ పాదయాత్ర చేసిన సమయంలో శుక్రవారం వచ్చిందంటే చాలు పొద్దునే తూతూమంత్రంగా గంటసేపు నడిచి.. హైదరాబాద్ వెళ్లి లోటస్‌పాండ్‌లో పడుకుంది నిజం కాదా? అంటూ ప్రత్తిపాటి ప్రశ్నించారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు జనాలను కనీసం దగ్గరలోకి కూడా రానివ్వలేదని ప్రత్తిపాటి తెలిపారు. పాదయాత్రలో ప్రతిరోజూ వేలాదిమంది నేరుగా వెళ్లి లోకేశ్‌ను కలిసి సెల్ఫీలు దిగుతున్నారని.. సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. లోకేశ్‌ను ఎవరెవరు కలుస్తున్నారో వైసీపీ నాయకులకు తెలియాలంటే పాదయాత్రను దొంగచాటుగా అనుసరిస్తున్న... ఐప్యాక్ బృందాన్ని అడిగి తెలుసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.

మార్గదర్శిపై దాడులు:  రాష్ట్ర ప్రభుత్వానికి లేని అధికారాలతో జగన్ మార్గదర్శిపై వేధింపులకు పాల్పడుతున్నారని ప్రత్తిపాటి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కోర్టులను, వ్యవస్థలను లెక్కచేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంలోని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మార్గదర్శి (Margadarshi)పై దాడులు చేస్తున్నారని ప్రత్తిపాటి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలతో... ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈనాడు పత్రిక ద్వారా వేలెత్తి చూపిస్తున్నందుకే మార్గదర్శిపై దాడులు చేస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలంతా రామోజీరావుకు అండగా ఉన్నారని ప్రత్తిపాటి తెలిపారు. చందాదారులపై ఒత్తిడి తీసుకొచ్చి సీఐడీ (CID) అధికారులు ఫిర్యాదులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. మార్గదర్శిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. సీఐడీని ఉపయోగించినా... దుష్ప్రచారం చేసినా రామోజీరావు విశ్వసనీయతను.. మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయలేరని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.