Prathidwani: ఆంధ్రప్రదేశ్‌లో పడగ విప్పిన ప్రతీకార రాజకీయాలు..!
Prathidwani: నేరం రాజ్యమేలితే ఎలా ఉంటుంది? ఆంధప్రదేశ్ పాలనలాగా ఉంటుంది. నేర ప్రవృత్తి కలిగిన వారి చేతిలో అధికారం తోడైతే ఎలా ఉంటుంది? ఆంధప్రదేశ్ రాజకీయంలా ఉంటుంది. ఇదీ.. జనం మాట. ఏపీలో జరుగుతున్న పగ, ప్రతీకార రాజకీయాలు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో విజనరీ లీడర్‌గా పేరు తెచ్చుకున్న నాయకుడి పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తున్న తీరును అసహ్యించుకుంటున్నారు ఎంతోమంది ప్రజలు. నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షనేతపై ఏ ఒక్క నేరం నిరూపించలేక.. చివరికి సంబంధం లేని ఆరోపణలతో జైలుకు పంపటం పూర్తి వ్యక్తిగత కక్షతోనే చేసిన పనిగా జనం భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, హైదరాబాద్‌లో, నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అనేక పాలనా సంస్కరణలు చంద్రబాబు తీసుకుని వచ్చారు. ఏ నాయకుడు చేయని విధంగా తన ఆస్తులు ప్రకటిస్తారు. అంతకంటే ఎక్కువ ఉన్నట్టు నిరూపించి ఎవరన్నా తీసుకోవచ్చని సవాల్ కూడా చేశారు. అలాంటి నాయకుడిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పౌరసమాజం ఏం అంటుందనే అంశంపై ప్రతిధ్వని చర్చ.