Police cases registered on TDP Motha Mogiddam: మోత మోగిద్దాంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు..!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 3:52 PM IST

thumbnail

Police Cases Registered on TDP Motha Mogiddam: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా... గుంటూరు బృందావన్ గార్డెన్స్ రోడ్డులో మోత మోగిద్దాం (Motha Mogiddam) కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిరసన కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా... ప్రజలకు ఆటంకం కలిగించేలా రహదారిపై నిరసన తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలను అతిక్రమించి రహదారిపైకి గుంపులుగా చేరి... పళ్లాలు, ఈలలు, డప్పులతో శబ్దం చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారని.. కేసు నమోదు చేశారు. పోలీసు వారి విధులకు సైతం ఆటంకం కలిగించడంతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిరసనలు తెలుపడం ప్రజలు, పార్టీల హక్కు అని.. ప్రభుత్వాలు సరిగా పని చేయనప్పుడు ప్రజలు తమ గళాన్ని వినిపించేందుకు నిరసనలు ఆయుధంగా ఉపయోగపడుతాయని పేర్కొంటున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు చేసే ర్యాలీలు, మీటింగ్​ల వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడటం లేదా అంటూ టీడీపీ(TDP) నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.