డంపింగ్​ యార్డ్​ ఏర్పాటుపై గ్రామస్థుల ఆందోళన - సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 5:21 PM IST

thumbnail

People Protest Against Dumping Yard Centers : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక నివాస ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్​ యార్డు కేంద్రానికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లా ముమ్మడివరం మండలం గోపాల్​నగర్​ గ్రామ ప్రజలు నిరసనకు దిగారు. గ్రామాల మధ్య చెత్త కేంద్రాలు ఏర్పాటు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న డంపింగ్​ యార్డు మార్చాలంటూ ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మరోచోట ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.   

ప్రతిరోజూ యానంలో సుమారు 9 టన్నుల చెత్తను ప్రైవేటు సంస్థ సేకరించి కనకాలపేట మార్గంలోని రహదారి పక్కన డంపింగ్​ చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఆందోళన చేస్తున్నారు. డంపింగ్​ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నా స్థానికులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్​ అశోక్​ సంఘీభావం తెలిపారు. ప్రజాభిప్రాయాలను సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని గొల్లపల్లి పేర్కొన్నారు. జనావాసాలకు దూరంగా ఉండేలా డంపింగ్​ యార్డ్​ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.