Pawan Kalyan Visited Vissannapeta Lands: వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు.. భూములపై మాత్రమే ప్రేమ: పవన్

By

Published : Aug 14, 2023, 7:05 PM IST

Updated : Aug 15, 2023, 6:44 AM IST

thumbnail

Pawan Kalyan Visited Vissannapeta Lands: ఉత్తరాంధ్రలో పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా సాగుతోందని.. కొండలను కొల్లగొడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ నేతలు పచ్చని కొండలను.. కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు ఉత్తరాంధ్ర భూములపై ఉన్న ప్రేమ.. అభివృద్ధిపై లేదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా విసన్నపేటలో ఆక్రమణకు గురైన భూములను పవన్ పరిశీలించారు. అనకాపల్లి నుంచి విసన్నపేటకు ర్యాలీగా పవన్‌కల్యాణ్‌ బయల్దేరగా.. బైక్‌ ర్యాలీలో పాల్గొన్న వందలమంది పవన్‌ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు అనుమతి లేదని.. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఊరిలోకి రావడానికి ఇరుకు రోడ్ ఉందని.. కానీ రియల్ ఎస్టేట్​ వంచర్​కి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్​ని కాదని సీఎం జగన్​నే అడుగుతున్నానని పవన్ అన్నారు. రైతుల భూమి అడ్డగోలుగా దోచేసి.. వెంచర్లు వేస్తున్నారని.. ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు.  ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవని అన్నారు. ప్రజలపై వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. ఉపాధి కోసం యువత ఎక్కడెక్కడికో వలసలు పోతున్నారని విమర్శించారు. వాల్టా చట్టం ఉల్లంఘనపై.. కేంద్ర పర్యావరణశాఖకు, ఎన్‌జీటీకి ఫిర్యాదు చేస్తానని జనసేనాని తెలిపారు. 

Last Updated : Aug 15, 2023, 6:44 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.