Pawan on Jagan: 30న జగన్​ గురించి మొత్తం మాట్లాడతా: పవన్​

By

Published : Jun 28, 2023, 10:43 PM IST

thumbnail

Pawan Kalyan comments on Jagan: సీఎం జగన్‌ మోహన్​ రెడ్డికి తెలుగు అక్షరాలు సరిగా రావు.. ఒత్తులు, దీర్ఘాలు రావు అందుకని ఆయనకు వరాహి, వారాహికి తేడా తెలియకుండా పోయిందని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. భవిష్యత్‌లో జనసేన వయోజన సంచార పాఠశాల ద్వారా తెలుగు నేర్పిస్తామని ఎద్దేవా చేశారు. ఇక్కడ కచ్చితంగా జనసేన జెండా ఎగరాలి.. మనం విజయకేతనం ఎగురవేయాలని అన్నారు. అలాగే అమ్మఒడి కార్యక్రమంలో సీఎం స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు శోచనీయమన్నారు. నేను ఊగిపోతా మాట్లాడుతున్నాను అని ఆయన బాధ పడిపోతున్నారు.. రేపటి నుంచి ఆయనలానే మాట్లాడతా అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 30న జగన్​ గురించి మొత్తం మాట్లాడతానని పవన్​ అన్నారు. పోరాటం చేయనిదే రాజకీయాల్లో మార్పు రాదు.. కేసులు గురించి భయపడితే మార్పు రాదు.. అందుకే అన్నింటికి తెగించే బరిలోకి దిగానని పవన్‌ అన్నారు. ప్రస్తుతం పవన్​ కల్యాణ్​ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. అవినీతి చేస్తున్న అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.