Pawan Kalyan, Lokesh, Balakrishna Meet in Rajamahendravaram: నేడు పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ బాలకృష్ణల భేటీ.. చంద్రబాబుతో ములాఖత్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 10:55 AM IST

thumbnail

Pawan Kalyan, Lokesh, Balakrishna meet in Rajamahendravaram: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌, బాలకృష్ణ నేడు రాజమహేంద్రవరంలో భేటీకానున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈభేటీకి ప్రాధాన్యం సంతరించుకోనుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌కు బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ కలిసి వెళ్లనున్నారు. ముందుగా బాలయ్య, పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌ను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి పవన్‌, బాలయ్య, లోకేశ్ కలిసి కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నారు. చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో విజయవాడ వస్తున్న జనసేనాని పవన్​ను పోలీసులు దారి పొడవునా అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆయన రాజమహేంద్రవరం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనను కలిసి.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సమీపంలోనే బస చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.