ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి- పరిటాల శ్రీరామ్ విసుర్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 8:21 PM IST

thumbnail

Paritala Sriram Criticizes to MLA Kethi Reddy : ప్రజలకు సమాధానం చెప్పే ఓపిక లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ఇంట్లో కూర్చోవాలని ధర్మవరం ఎమ్మెల్యేపై పరిటాల శ్రీరామ్ విరుచుకు పడ్డారు. ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీరామ్ మాట్లాడారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అరాచక పాలన చేస్తున్నారని తప్పులు ప్రశ్నిస్తే దాడులు చేస్తామని మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యావహరిస్తు ధర్మవరం, తాడిమర్రిలో రహదారుల ఏర్పాటు పేరుతో నివాస గృహాలు కూల్చివేశారని తెలిపారు. 

సరైన పరిహారం ఇవ్వకుండా మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే తప్పులు ప్రశ్నిస్తే సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం చేతకాకుంటే ఇక ఎమ్మెల్యే ఉండి ఎందుకుని విమర్శించారు. గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయమంటే వారు మాత్రమే అభివృద్ధి అవుతున్నారని మండిపడ్డారు. నాయకులు వందల ఎకరాలు సంపాదించుకున్నారు మేము మాత్రం ఏప్పటి లాగే అదే స్థితిలో ఉన్నామని ప్రజలు విమర్శిస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.