అనంతపురం జిల్లాలో అమానుషం - వైసీపీ జెండా కాల్చేశాడని

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 8, 2024, 4:21 PM IST

thumbnail

Palturu Police Attack on TDP Activist : అధికార పార్టీ నాయకుల ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్తను పోలీసులు తీవ్రంగా కొట్టి నగ్నంగా స్టేషన్ ఎదుట తిప్పిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ ఈనెల ఒకటో తేదీ రాత్రి వైసీపీ జెండాను కాల్చివేశాడని ఆరోపిస్తూ అధికార పార్టీ నాయకులు పాల్తూరు పోలీసు స్టేషన్​లో రెండో తేదీన ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం అదే రోజున అతన్ని పోలీసు స్టేషన్​కు పిలిపించి చితకబాది నగ్నంగా బయటకు పంపిన వీడియో బయటకు వచ్చింది. 

మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడని, అధికార పార్టీ జెండా కాల్చాడనే ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నడవలేని స్థితిలో అతను ఉండటంతో శనివారం కుటుంబ సభ్యులు బళ్లారి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై తాము విచారించామని, చంద్రమోహన్ పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో కేసు నమోదు చేశామని డీఎస్పీ నరసింగప్ప ఆదివారం ఉరవకొండలో విలేకరులకు తెలిపారు. పోలీసులు అతడిని కొట్టలేదని డీఎస్పీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.