PAC Chairman Payyavula Keshav on Fiber Grid అధికారులను విచారించకుండా.. బాబుపై ఆరోపణలు ఏలా! తప్పుడు నివేదికలతోనే ఫైబర్‌ గ్రిడ్‌ అంశం తెరపైకి..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 10:15 PM IST

thumbnail

PAC Chairman Payyavula Keshav on Fiber Grid Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుని విచారించాలనుకునే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం.. గత ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలోని ముగ్గురు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారుల్ని విచారించిందా..? అని ప్రశ్నించారు. విచారిస్తే వారు ఏం చెప్పారు..?, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాకే.. చంద్రబాబు ప్రస్తావన రావాలని డిమాండ్‌ చేశారు.

Payyavula Keshav Comments: పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ..''ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. భౌతిక విచారణ చేయకుండానే శరత్ అసోసియేట్స్‌ నివేదిక ఇచ్చింది. 42 సెంటర్లలో భౌతిక విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 42 కేంద్రాలకు సామగ్రి సరఫరా జరిగింది. 42 కేంద్రాల్లో ఉన్న ఎక్విప్‌మెంట్‌ చూపిస్తూ.. వీడియోలు చూపిస్తాం. ఏ ఎక్విప్‌మెంట్‌ అడిగితే, ఆ ఎక్విప్‌మెంట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ సెంటర్లలో కనిపిస్తుంది. 160 పేజీల సీమెన్స్ కంపెనీ అద్భుత పని తీరు కనబరిచిందని నివేదికలు వచ్చాయి. కుట్రపూరితంగానే శరత్‌ అసోసియేట్స్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకుని, కేసులు పెట్టారు. 

దీంతో ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడింది. ఫైబర్‌ గ్రిడ్‌లో ప్రతి విషయాన్ని ఐఏఎస్‌లతో కూడిన హైపవర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌ గ్రిడ్‌లో కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. ఐఏఎస్‌ అధికారులను విచారించకుండా చంద్రబాబుపై మాత్రమే ఆరోపణలు ఎలా చేస్తారు. ఫైబర్ గ్రిడ్ కేసుని తెరపైకి తీసుకురావాలనుకుంటున్న పాలకుల ఆలోచనలు ప్రత్యర్థుల్ని వేధించాలన్న ఫ్యాక్షన్ మనస్తత్వంలో భాగమే. శరత్ అసోసియేట్స్ సంస్థతో తొలుత ఫిజికల్ వెరిఫికేషన్ చేయమన్న జగన్ సర్కార్.. తర్వాత వద్దని చెప్పి తూతూమంత్రంగా ఆడిట్ రిపోర్ట్ తీసుకోవడం ముమ్మాటికీ కుట్రలో భాగమే. శరత్ అసోసియేట్స్ సంస్థ, జగన్ రెడ్డి కంపెనీల ఆడిట్స్ నిర్వహించే సంస్థలు వ్యక్తులు ఒకే కంప్యూటర్ వినియోగించడం కూడా ప్రభుత్వ కుట్రలను బలపరుస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే. '' అని పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.