నందిగామలో ఘనంగా న్యాయ సేవా దినోత్సవం - న్యాయమూర్తులు, న్యాయవాదుల ర్యాలీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 3:03 PM IST

thumbnail

National Legal Services Day in NTR District : ఎన్​టీఆర్ జిల్లా నందిగామలో ఘనంగా న్యాయ సేవల దినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం న్యాయసేవలను ఉద్దేశించి ప్రసంగాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు 16వ అదనపు జడ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతా కోర్టు నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ తీశారు.

Lawyers Judges Rally in Nandigama : ఈ సందర్భంగా జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ... న్యాయ సేవలు అర్హులైన వారు ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ప్రతీ ఒక్కరూ న్యాయ సేవలు ఉపయోగించుకోవచ్చు అని ఆయన పేర్కొన్నాారు. ఈ ర్యాలీలో సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీ రాజ్యం, జూనియర్ సివిల్ జడ్జిలు తిరుమలరావు, రియాజ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బండి మల్లికార్జునరావు. జిల్లా కోర్టు పీపీ(పబ్లిక్​ ప్రాసిక్యూటర్​) రంగా, మట్ట ప్రసాద్‌, సహా మరికొందరు లాయర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.