ఎమ్మెల్యే కేతిరెడ్డి, మున్సిపల్ కార్మికుల మధ్య వాగ్వాదం - తాడిపత్రిలో ఉద్రిక్తత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 3:27 PM IST

Updated : Jan 4, 2024, 4:32 PM IST

thumbnail

Municipal Workers Protest Against MLA Ketireddy Peddareddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రైవేటు వ్యక్తులతో తాడిపత్రి పట్టణంలో చెత్త తరలించే కార్యక్రమం చేపట్టారు. ఈ చెత్త తరలింపు కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. 

తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలో ఉన్నామని, ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశం కాదని ఎమ్మెల్యేకు కార్మికులు విన్నవించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులు వినకుండా బలవంతంగా ప్రైవేటు వ్యక్తులతో చెత్త తరలించే కార్యక్రమం చేపట్టగా కార్మికులకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి కార్మికులను స్టేషన్​కు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెలో ఉంటే అధికారులు ప్రైవేట్‌ వ్యక్తులతో చెత్తను తొలగించడం ఏంటని మున్సిపల్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నగర పాలక సంస్థ ఆవరణలో చెత్త వేసి నిరసన తెలిపారు. తర్వాత సమ్మెలో భాగంగా దీక్ష శిబిరం వద్ద మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

Last Updated : Jan 4, 2024, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.