Raghurama on Avinash Reddy: తల్లి అనారోగ్యానికి, అవినాష్ అరెస్టుకు సంబంధమేంటి: రఘురామరాజు
Published: May 22, 2023, 4:40 PM

Raghuramakrishna Raju on Avinash Reddy: వివేకా హత్య కేసు విచారణకు హాజరయ్యే అంశంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు మరో లేఖ రాయడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా మండిపడ్డారు. సుప్రీంకోర్టులో రేపు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందో.. లేదో.. అవినాష్‌కు ఎలా తెలుసని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్‌పై రేపు విచారణ ఉంది.. మినహాయింపు కావాలని అవినాష్ సీబీఐకి లేఖ రాశారు. రేపు సుప్రీంలో పిటిషన్ విచారణకు వస్తుందని అవినాష్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రావచ్చు.. రాకపోవచ్చు.. ఆయన తల్లి అనారోగ్యానికి.. అవినాష్ అరెస్టుకు సంబంధం ఏంటని నిలదీశారు. నిజంగా ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్‌లో.. మరొకచోట చేర్చాలి.. హైదరాబాద్‌లో అయితే వీరికి అన్ని రకాల సహకారాలు అందవనా.. ధర్నాలు, ఆందోళనలు చేస్తే అరెస్టులు ఆపేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. కర్నూలులో ఉంటే కడపకు దగ్గరగా ఉంటుందనా.. నాటకాలు ఆడుతున్నారా లేక కర్నూలులో మన సీఎం.. మన పోలీసులనా.. ఇక్కడ చేర్చింది అని రఘురామ వ్యాఖ్యానించారు.