రఘువీరా రెడ్డిని కలిసిన కాపు రామచంద్రారెడ్డి - రెండు గంటల పాటు చర్చ

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 9, 2024, 9:50 PM IST

thumbnail

MLA Kapu Ramachandra Reddy Meet CWC Member Raghuveera Reddy: సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డిని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరా రెడ్డిని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సతీమణితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. 

రఘువీరా నివాసంలో దాదాపు రెండు గంటల పాటు ఇరువురు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం గ్రామంలోని నీలకంఠాపురం దేవాలయాలను కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లో వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తానని తిరుగు ప్రయాణంలో మీడియా ప్రతినిధితో తన మనసులోని మాటను కాపు రామచంద్రారెడ్డి వ్యక్త పరిచారు.  

కాగా ఇటీవల సీఎం జగన్​పై కాపు రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆవేదన చెందిన రామచంద్రారెడ్డి, ‘మీకు గుడ్‌ బై’ అంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ చేశారు. జగన్​ని నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు. దీంతో తాజాగా కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.