విద్యార్థులకు సేవ చేసేందుకు బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు: వసుంధర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 6:07 PM IST

thumbnail

MLA Balakrishna Wife Vasundhara Distrubuted Material to Schools In satyasai District : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన సేవలు చేయడానికి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారని ఆయన సతీమణి వసుందర తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ  పాఠశాలలకు వెళ్లి అవసరమైన అవసరమైన సామాగ్రిని అందించారు. హెరిటేజ్ సంస్థ సహకారంతో 8 లక్షల రూపాయల విలువ గల సామాగ్రిని ఆమె అందజేశారు. నియోజకవర్గంలోని కొన్ని పాఠశాలలకు జిరాక్స్ మిషన్​లు, కంప్యూటర్లు, ఎల్​ఈడీటీవీ(LED TV)లు, ప్రింటింగ్ మిషన్లు, సోలార్ వాటర్ హీటర్ ప్లాంట్లను అందించి.. తరువాత వాటిని ఆమె ప్రారంభించారు. 

Balakrishna Wife In Hindupuram : నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమన్నారు వసుంధర. కార్పొరేట్​ పాఠశాలకు మన బడి ఏ మాత్రం తక్కువ కాదు అన్నారు. పిల్లలను చూస్తుంటే తనకు భగత్​ సింగ్​, అబ్దుల్​ కలాంలు కనిపిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పిల్లలతో ప్రసంగించిన వసుంధర.. చంద్రయాన్​ విజయంలోనూ తెలుగు వారి హస్తం ఉందని అన్నారు. అందరూ గొప్పవారిగా ఎదగాలని పిల్లలకు ఆమె సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.