Mistakes in Uravakonda Voters List ఆ 50 ఇళ్లకు.. మూడే డోర్​ నెంబర్లు! బాబోయ్ ఇదేం లెక్క..

By

Published : Aug 19, 2023, 11:26 AM IST

thumbnail

Mistakes in  Uravakonda Voters List: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఓటర్ల జాబితాల.. 50 ఇళ్లకు మూడు డోర్ నెంబర్లు ఉన్నట్టు తప్పుగా నమోదు చేశారు. 131 పోలింగ్ బూత్ పరిధిలో 296 గృహాలు కేటాయించారు. జాబితాలో 8 -3-155 ఇంటి నంబరుతో 15 ఇళ్లు.. 8-3-165 ఇంటి నెంబరుతో మరో 15 .. 8-3-185లో 20 ఇళ్లు నమోదయ్యాయి. వీటి పరిధిలో 200కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇంటింటా ఓటరు జాబితా పరిశీలనలో ఈ తప్పి దాన్ని బీఎల్​వో గమనించినా.. సరిచేయించడానికి ప్రయత్నించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియ ముగియడానికి ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. వాటిని సరిచేయకపోతే 200కు పైగా ఓటర్ల వివరాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ మద్దతుదారులవేనని తెలిసింది. దీనిపై ఉరవకొండ తహసీల్దారు, ఓటరు నమోదు సహాయాధి కారి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.