Minister Kottu Satyanarayana Reacted on Rushikonda Buildings: రుషికొండ భవన నిర్మాణాలపై మంత్రి కొట్టు కీలక వ్యాఖ్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 8:57 PM IST

thumbnail

Minister Kottu Satyanarayana Reacted on Rushikonda Buildings: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి స్థానిక భ్రమరాంబ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం రుషికొండ భవన నిర్మాణాలపై స్పందించారు. రుషికొండపై నిర్మిస్తున్నవి ప్రభుత్వ భవనాలే అని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ప్రభుత్వ భవనాలు దేనికోసం కడతారు అంటూ మంత్రి విలేకరులను ఎదురు ప్రశ్నించారు. అవి టూరిజం కోసం కట్టిన భవనాలు కాదా అని విలేకరులు ప్రశ్నించగా.. టూరిజానికి ప్రభుత్వ భవనాల అవసరం ఏముంటుంది? టూరిజం కోసం అయితే హోటళ్లు, కాటేజీలు కడతారన్నారు. ప్రభుత్వ భవనాలను దేనికి అవసరమైతే దానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని మంత్రి చెప్పారు. తెలుగుదేశం పార్టీతో 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారన్న ఆరోపణలు చంద్రబాబు నాయుడు చేస్తున్న జమ్మికులు అని కొట్టి పారేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కంటే మెండుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారని మంత్రి అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.