కాంట్రాక్టు గడువు ముగిసినా ఆగని ఇసుక తవ్వకాలు - మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 6:07 PM IST

thumbnail

Mining Department Officials Raids on Sand Reaches: అనంతపురం జిల్లా రాయదుర్గంలో జుంజురాంపల్లి వేదవతి హగరి నది ఇసుక రీచ్​పై.. మైనింగ్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేసి.. అక్రమ రవాణా సాగిస్తున్న ఒక ప్రొక్లెయిన్​, 17 టిప్పర్లను సీజ్ చేశారు. ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసినా తవ్వకాలు జరుపుతున్నారన్న ఫిర్యాదుతో మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 

గత కొన్ని రోజులుగా రాత్రిపూట భారీ సంఖ్యలో.. టిప్పర్లలో జుంజురాంపల్లి, వేపరాళ్ల రీచ్ల నుంచి ఇసుక కర్ణాటకకు అక్రమంగా రవాణా జరుగుతోందని.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని రాయదుర్గం నియోజకవర్గం నుంచి అధికార పార్టీ నేతలు అండదండలతో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు ఆదాయ వనరుగా మారిన ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 110 ఇసుక రీచుల అనుమతులను నేషనల్ గ్రీన్ ట్రిబునల్ రద్దు చేసినట్లు తెలిపారు. జుంజురాంపల్లి ఇసుక రీచ్​లో సీజ్ చేసిన టిప్పర్ల వివరాలను అధికారులు వెల్లడించాలని, వాటిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని తక్షణమే శిక్షించాలని పోలీసులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.