'అధికార పార్టీ మెప్పు పొందటం కోసమే సీఐడీ పని చేస్తోంది'

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 8, 2024, 10:47 PM IST

thumbnail

Kolikapudi Srinivasa Rao Attend in CID Investigation: సీఐడీ రెండోసారి విచారణలో భాగంగా వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. సీఐడీ విచారణలో భాగంగా సోమవారం గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి ఆయన హాజరయ్యారు. మళ్లీ 12వ తేదీన విచారణకు రావాలని సీఐడీ అధికారులు చెప్పారని కొలికపూడి వివరించారు. విచారణ సంస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టే అక్రమ కేసైనా సహకరిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు ఏపీ సీఐడీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నోటీసులు ఇచ్చారని కొలికపూడి తరఫు న్యాయవాది కావూరి గోపీనాథ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందటం కోసమే సీఐడీ పని చేస్తోందని విమర్శించారు. మరో నాలుగు నెలల్లో దిగిపోయే ప్రభుత్వానికి తాము భయపడే పరిస్థితులు లేవని కొలికపూడి అన్నారు. 

సీఐడీ లేని పరిధిని సృష్టించుకొని అబాసుపాలు కావడం అనే విధంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు సీఐడీ వాళ్లు పెట్టిన ఏ కేసులోను ఛార్జ్​షీటు దాఖలు చేయలేదు. సీఐడీ ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీ నాయకుల మెప్పు పొందటం కోసమే ఇలా చేస్తోంది. వాళ్లని సంతృప్తి పరచటం కోసమే కేసు నమోదు చేశారని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. -గోపీనాథ్, న్యాయవాది

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.