కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు - త్రికోటేశ్వరస్వామికి మొక్కులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 3:02 PM IST

thumbnail

Karthika Masam Lord Shiva Pooja in kottappakonda : కార్తిక పౌర్ణమికి తోడు సోమవారం కూడా కలిసి రావాడంతో రాష్ట్రంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్ప కొండకు భక్తులు పోటెత్తారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచి మహిళలు పూజలు నిర్వహించి, కార్తిక దీపాలు వెలిగించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తుల తాకిడితో కోటప్పకొండలో ట్రాఫిక్ స్తంభించింది.

Karthika Pournami Celebrations : కోటప్పకొండలో కార్తిక సోమవారం నాడు శ్రీ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయంలో సందడి నెలకొంది. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కొండ దిగువన ఘాట్ రోడ్ నుంచి మెట్ల మార్గం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. చాలాసేపటి వరకు ట్రాఫిక్‌లో చిక్కుకుని భక్తులు ఇబ్బంది పడ్డారు. కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.