బస్​ డ్రైవర్​ నిర్లక్ష్యానికి బామ్మ బలి.. లారీ కింద ఇరుక్కుని మరో ఉద్యోగి..

By

Published : Mar 31, 2023, 9:38 AM IST

thumbnail

కర్ణాటకలో ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలైంది. మంగళూరులోని బెందూర్​వెల్​ సర్కిల్​ ప్రాంతంలో ఐరీనా డిసౌజా(65) అనే వృద్ధురాలు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఆగ్నెస్​ సర్కిల్​ నుంచి బెందూర్​వెల్​ సర్కిల్​ వరకు ఆ వృద్ధురాలు ఓ ప్రైవేట్​ బస్సులో ప్రయాణించింది. స్టాప్ వచ్చాక తోటి ప్రయాణికులతో కలిసి బెందూర్​వెల్​లో ఐరీనా డిసౌజా దిగారు. అయితే తాను వచ్చిన బస్సు ముందు నుంచి రోడ్డు దాటేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే వృద్ధురాలు రోడ్డు దాటుతుందని గమనించిన డ్రైవర్​.. ఒక్కసారిగా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు ఆ వృద్ధురాలిపై నుంచి వెళ్లడం వల్ల తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్​ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లిన లారీ.. బైకర్​ మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ బైకర్​ను లారీ ఢీకొట్టి కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది. దీంతో బైకర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. దిండిగల్​ జిల్లాలోని పల్లపట్టి గ్రామానికి చెందిన తమిళేంద్ర సర్కార్(35) అనే వ్యక్తి.. తన భార్య, కుమార్తెతో కలిసి బైక్​పై అమ్మాయనాయయకరన్​ ప్రాంతానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వారు బైక్​పై వెళ్తుండగా.. ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న​ బారికేడ్​కు ఢీకొట్టారు. వెంటనే బైక్​ అదుపుతప్పి.. పక్కనే వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో తమిళేంద్ర సర్కార్​ లారీ వెనుక చక్రాల కింద చిక్కుకున్నాడు. దాదాపు కిలోమీటర మేర లారీ తమిళేంద్రను ఈడ్చుకెళ్లింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అతడి భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బైకర్ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు తమిళేంద్ర ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తుండగా.. అతడి భార్య ఓ ప్రైవేట్​ స్కూల్​లో టీచర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.     

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.