వైసీపీ జెండాలపై జేసీ ప్రభాకర్​ రెడ్డి ఆందోళన - పరిస్థితి ఉద్రిక్తం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 9:07 PM IST

thumbnail

JC Prabhakar Reddy Agitation on YSRCP Flag Issue: తాడిపత్రి పట్ణణంలో మున్సిపల్​ చైర్మన్​ జేసీ ప్రభాకర్​ రెడ్డి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారీ తీసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన వైసీపీ జెండాలను పోలీసులు తేసేస్తామని హామీ ఇచ్చి తీయకపోవడంపై ఆయన ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా, పోలీసులకు ప్రభాకర్​ రెడ్డికి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్​సీపీ నాయకులు నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పలు చోట్ల పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ జెండాలు విద్యుత్​ దీపాలకు అడ్డుగా ఉన్నాయని, ప్రభాకర్​ రెడ్డి తొలగించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అప్పుడు పోలీసులు, వైఎస్సార్​సీపీ కార్యకర్తలు జేసీని అడ్డుకున్నారు. రెండు రోజుల్లో అడ్డుగా ఉన్న జెండాలను తొలగిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసులు ఇచ్చిన హామీ గడువు రెండు రోజులు దాటిపోయిందని, జెండాలను తొలగించలేదని ఆయన బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో జేసీ ప్రభాకర్​ రెడ్డి, ఆయన అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ప్రభాకర్​ రెడ్డిని జీపులో ఎక్కించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. జేసీ ప్రతిఘటించడంతో పోలీసులు శ్రమించి జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.