వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పారు - సామాన్యుడిపై ఎమ్మెల్యే దాడి దారుణం : నాదెండ్ల - Nadendla manohar comment

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:23 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధిచెప్పారు- సామాన్యుడిపై ఎమ్మెల్యే దాడి దారుణం : నాదెండ్ల (ETV Bharat)

Manohar Comments on Tenali MLA Attack : తెనాలిలో ఎన్నికల పోలింగ్​ కేంద్రంలో జరిగిన ఘటనపై జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్​ స్పందించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ క్యూ పాటించకుండా నేరుగా వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేయగా ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పడం, కోపంతో ఊగిపోతూ ఎమ్మెల్యే అతడిపై దాడి చేయడం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న ఎన్నికల సంఘం శివకుమార్​కు గృహనిర్బంధం విధించింది. పోలింగ్​ ముగిసే వరకు అతడు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో మనోహర్ మాట్లాడారు. 

రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పనున్నారని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రిని చూసి వైసీపీ శాసనసభ్యులు కూడా దాడులతో  ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సామాన్యమైన ఓటర్ పై ఎమ్మెల్యే దాడి చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ఓటర్లను కొట్టి ఆ ఘటన నుంచి తప్పించుకునేందుకు కులాలు, మతాలు రెచ్చగొట్టడం బాధాకరమన్నారు. ఓటర్ పై దాడిని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుందన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.