Janasena Leaders Meet Nara Lokesh: టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు మద్దతిస్తాం.. లోకేశ్‌కు స్పష్టం చేసిన జనసేన నాయకులు
Janasena Leaders Meet Nara Lokesh: రాజమహేంద్రవరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బస చేసిన కేంద్రానికి జనసేన నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, శెట్టి బత్తుల రాజాబాబు, ఇతర నేతలు లోకేశ్‌తో సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ లోకేశ్‌కు జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన నేతలు ప్రకటించారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ, జనసేన మధ్య బంధం మరింత బలపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును పవన్ కల్యాణ్ ఖండించారు. అంతే కాకుండా నారా లోకేశ్‌కి ఫోన్ చేసి తమ సపోర్టు ఉంటుందని, వైసీపీ పాలనపై కలిసి పోరాటం చేద్దామని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీకి వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి తన మద్దతును తెలియజేశారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది.