Atchannaidu about TDP Mahanadu: 'ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా.. మహానాడు విజయవంతమవుతుంది'
Published: May 26, 2023, 3:51 PM

Atchannaidu about TDP Mahanadu: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా గోదావరి తీరంలో నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడుకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మంది వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను ఆయన తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, భరోసా అందివ్వనున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పారు. ప్రతినిధుల సమావేశంలో.. రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అమలు చేయాల్సిన అంశాలపై అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోపైన ప్రాథమిక అంశాలు వెల్లడిస్తారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. విధ్వంస పాలనతో ఆంధ్రరాష్ట్రం అంటే అసహ్యించుకనే స్థాయికి తీసుకొని వెళ్లారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభిమానులు, పార్టీ శ్రేణులు మహానాడును విజయవంతం చేస్తారంటున్న అచ్చెన్నాయుడితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.