International Anti Drug Day: 'యువతా మేలుకో.. మత్తు నుంచి తేరుకో..'

By

Published : Jun 26, 2023, 3:05 PM IST

thumbnail

International Anti Drug Day 2023: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. బాపట్ల జిల్లా చీరాలలో డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో యువత మత్తుకు బానిస కాకూడదేనే ఉద్దేశంతో విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి చీరాలలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మత్తు నుంచి యువతను మేల్కొల్పేందుకు తోడ్పతామంటూ.. పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో కూడా సర్కిల్ ఇన్​స్పెక్టర్​.. ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా.. గంజాయి, మద్యం, నాటు సారా వంటి మత్తు పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాలు పాడవుతాయని.. వీటికి పెద్దలతో పాటు యువకులు దూరంగా ఉండాలని సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సూచించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ముమ్మిడివరం సెంటర్​లో విద్యార్థులతో పాటు ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు వినియోగం వద్దు.. ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దంటూ పురవీధుల్లో మత్తు పదార్థాల అమ్మకాలు వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.