విజయవాడకు మద్యం అక్రమ తరలింపు - పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన దందా

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 18, 2024, 8:00 PM IST

thumbnail

Illegal Liquor Shipment in Vijayawada : విజయవాడ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న మద్యం అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. హరియణా నుంచి విజయవాడకు ఖరీదైన బ్రాండెడ్​ మద్యం సరఫరా జరుగుతోంది. నగరంలో గోడౌన్​ ఏర్పాటు చేయడం వల్ల అక్రమ వ్యాపారం మరింత జోరుగా సాగుతోంది. ఈ అక్రమ మద్యం వ్యాపారంలో ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఒక్కచోటే రూ.25 లక్షలు విలువైన ఇండియన్​ మేడ్​ ఫారిన్​ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Illicit Supply of Liquor Found in the Checks of the Police Officers : విజయవాడ పరిధిలో పీఎస్​ల్లో జనవరి 1 నుంచి 15 వరకు చేసిన తనిఖీల్లో మొత్తం రూ. 90 లక్షల విలువ చేసే లిక్కర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 3.72 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, ఆభరణాలు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నట్లు ఎన్టీఆర్​ జిల్లా సీపీ కాంతిరాణా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.