Honey bees attack on Minister: మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి.. ఒకరి పరిస్థితి విషమం

By

Published : Jun 28, 2023, 5:38 PM IST

thumbnail

Honey bees attack on Minister Buggana: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింద కొట్టాల సమీపంలోని గుహలను చూసేందుకు బుగ్గన సహా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. వీరిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే మంత్రి  బుగ్గన భద్రతా సిబ్బంది ఆయనను కాపాడారు. ఈ దాడిలో  సుమారు 70 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మంత్రితో పాటు స్థానికులు, కార్యకర్తలు, అధికారులపై తేనెటీగలు దాడి చేయగా... ఈ  ఘటనలో సీఐ ప్రియతం రెడ్డి, ఎస్ఐ శంకర్ నాయక్​తో పాటుగా పలువురికి తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు వారిని బేతంచర్లలోని ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. గాయపడిన వారి ఆరోగ్యపరిస్థితిపై మంత్రి బుగ్గన సమీక్షిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.