ముంచెత్తిన వరద - వర్షపు నీటితో చెరువును తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 4:40 PM IST

thumbnail

Govt Schools Submerged in Water due to Heavy Rains : గత రెండు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో పాఠశాలలు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలోని మర్రిపాడు మండల కేంద్రంలో ఉన్న.. జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల పూర్తిగా వర్షపు నీటితో జలమయమైంది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్‌ను అధికారులు ఇటీవల బాగు చేశారు. అయినప్పటికి పాత స్కూల్ భవన ఆవరణం పూర్తిగా పల్లపు ప్రాంతంలో ఉండటంతో చిన్న పాటి వర్షం కురిసిన పాఠశాల ఆవరణంలో నీరు నిలిచిపోయి స్కూలు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. 

రెండు రోజులుగా మర్రిపాడులో భారీగా వర్షం పడటంతో నీరు నిలిచి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. వర్షం పడితే విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్‌కు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షానికి స్కూల్‌ ప్రాంగణమంతా వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.