తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా పేలుడు కలకలం - అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 5:48 PM IST

Updated : Nov 6, 2023, 6:50 PM IST

thumbnail

Firecrackers Fire In Tirumala Express Train: తిరుమల ఎక్స్​ప్రెస్​లో బాణసంచా పేలుడు కలకలం రేగింది. తుని స్టేషనులో రైలు ఆగి ఉన్న సమయంలో.. ఎస్-3 బోగీలో బాణసంచా పేలుడుతో పొగలు వచ్చాయి. ఈ ఘటనతో ఆందోళన చెందిన ప్రయాణికులు.. కాళ్లతో బాణసంచాను తొక్కి తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్కసారిగా వచ్చిన శబ్ధాలతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ట్రైన్‌ డోర్ దగ్గరున్న బాణసంచా (Firecrackers) ను ప్రయాణికులు కిందకు నెట్టివేశారు. 

ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు, ఆర్​పీఎఫ్ (RPF) పోలీసులు.. రైల్లో తనిఖీలు చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. రైలు మెుత్తం పూర్తిగా పరిశీలించారు. ఆకతాయి చేష్టలా.. లేదా కావాలనే ఎవరైనా బాణసంచా పేల్చారా అనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత తుని నుంచి రైలు బయలుదేరి వెళ్లింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. 

Last Updated : Nov 6, 2023, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.