Film Actress Anasuya Opened Shopping Mall in Nandyala: నంద్యాలలో సినీనటి అనసూయ సందడి.. ఫొటోల కోసం ఎగబడిన కుర్రకారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 2:56 PM IST

thumbnail

Film Actress Anasuya Opened Shopping Mall in Nandyala: ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత, సినీ నటి అనసూయ నంద్యాలలో సందడి చేసింది. పట్టణంలో ఓ నూతన షాపింగ్ మాల్​ను ప్రారంభించేందుకు నంద్యాలకు వచ్చిన అనసూయ.. నవ్వులతో అభిమానులను ముంచేసింది. అనసూయను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడకు జనం చేరుకున్నారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై అనసూయ డాన్స్​ చేసి అభిమానులను అలరించారు. అక్కడకు వచ్చిన అభిమానులు అమెతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. 

అందుకే జబర్దస్త్​కు దూరం: ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోచా బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఇషాక్ బాషాలు పాల్గొన్నారు. ఆడవారు ఆనందంగా ఉండాలంటే అందంగా ఉండాలని.. అందుకు షాపింగ్ మాల్​లో వస్త్రాలు కొనుగోలు చేయాలని అనసూయ అన్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వుతూ ఉంటాను.. సీరియస్ పాత్రలు సినిమాల్లో ఉండడం వల్ల అభిమానులు కన్ఫ్యూస్ అవుతున్నారని.. అందువల్లే జబర్దస్త్​కు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.