Father and Son Suicide: చేసిన అప్పులు తీర్చలేక.. ఏం చేయాలో దిక్కుతోచక

By

Published : Jul 24, 2023, 3:17 PM IST

thumbnail

Farmers Commit Suicide Due To Debt: అనంతపురం జిల్లా బెళుగుప్ప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో రైతులైన తండ్రి రామ్మూర్తి (66), కుమారుడు సాయికుమార్​లు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఉద్యాన పంటలు సాగు చేస్తూనే శనగల వ్యాపారం చేస్తుండేవారు. మూడేళ్లుగా సాగులో తీవ్ర నష్టాలు వచ్చాయి. శనగల వ్యాపారం కలిసి రాకపోవడంతో రూ. 20 లక్షలు అప్పు చేశారు. వాటిని తిరిగి తీర్చేందుకు సొమ్ము లేకపోవడంతో.. గంజికుంట సమీపంలోని పవన విద్యుత్‌ పంఖా టవర్‌ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చాలా సేపటి నుంచి తండ్రి, సోదరుడు కనిపించక పోయేసరికి రామ్మూర్తి మరో కుమారుడు హరి పోలీసులను ఆశ్రయించాడు. వారి సెల్​ఫోన్లు చివరగా పని చేసిన స్థానాన్ని తెలపడంతో, అక్కడికి వెళ్లి చూడగా విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.