సాగునీరు లేక పంటను దున్నేసిన రైతు - మరోచోట నాలుగున్నర ఎకరాల పంట పశువులకు మేతగా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 9:40 PM IST

thumbnail

Farmer Plowed Black Gram Crop Due to Lack of Rain: వర్షాలు లేక ఎండుతున్న మినుము పంటను ఓ రైతు దున్నివేయగా.. మరో రైతు తన నాలుగున్నర ఎకరాల మినుము పంటను పశువులకు మేతగా వదిలేసిన ఘటన వైఎస్సార్​ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం బుసిరెడ్డిపల్లె గ్రామంలో వర్షాలు లేక ఎండుతున్న మినుము పంటను చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు దున్నేశాడు. ఒక ఎకరాకు దాదాపు 20 వేల నుండి 25 వేల రూపాయలు ఖర్చు చేసి చివరకు వర్షం పడకపోవడంతో దున్నివేయవలసి వచ్చిందని దిగాలుపడ్డారు. మరోచోట పెండ్లిమర్రి మండలం ఎం చౌటపల్లికి చెందిన చెండ్రాయుడు అనే రైతు నాలుగున్నర ఎకరాల మినుము పంటను పశువులకు మేతగా వదిలేశారు. 

కమలాపురం మండలంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్త ఎల్లారెడ్డి, టీడీపీ నియోజకవర్గ రైతు నాయకుడు ప్రభాకర్ రెడ్డిలు.. ఎండుతున్న పంటలను పరిశీలించారు.. ప్రజా నాయకుల చేతకానితనం వల్ల కనీసం పంటలను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు నియమించడంలో ఉన్న నిబద్ధత రైతులకు సాగునీరు అందించడంలో లేదన్నారు. మైలవరం దక్షిణ కాలువ ద్వారా కమలాపురం చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించి ఎండిపోతున్న పంటలు కాపాడాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.