Prathidwani: కొవిడ్‌ కొత్త వేరియంట్‌.. ముందుగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి ?

By

Published : Aug 11, 2022, 10:33 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

Prathidhwani: దేశ రాజధాని దిల్లీ నగరంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బయటపడింది. ఒమిక్రాన్‌ బీఏ 2.75గా గుర్తించిన ఈ వైరస్‌ ఉత్పరివర్తనం టీకాలు తీసుకున్న వారిపై కూడా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే... ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్‌ వేరియంట్లన్నీ డెల్టా తరహాలో తీవ్ర నష్టం కలిగించేవి కావని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కోణంలో కొత్త వేరియంట్‌ అంతగా ప్రమాదకరం కాకపోవచ్చన్నవిశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అయితే... దిల్లీలో ఇప్పటికే రోజుకు రెండు వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో దిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ... ప్రజలు అంతా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ స్వభావం ఎలా ఉంది? గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి ? అనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.