నూతన పెన్షన్​ విధానం వద్దు - ఓపీఎస్ అమలు చేయాలి : రైల్వే ఉద్యోగులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 3:21 PM IST

thumbnail

Employees Relay Hunger Strike to Cancel the New Pension System : నూతన పెన్షన్​ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ సౌత్​ సెంట్రల్​ రైల్వే ఎంప్లాయీస్  సంఘం ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు నిరసన బాట పట్టారు. విజయవాడ డివిజనల్​ రైల్వే మేనేజర్​ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. దేశ వ్యాప్తంగా పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ జనవరి 8న నుంచి 11న వరకు నిరాహార దీక్షలు చేపట్టామని ఎంప్లాయీస్​ సంఘ నాయకులు తెలిపారు.

Railway Employees Strike : కొత్త పెన్షన్ విధానం వల్ల జీవితకాలం ఉద్యోగం చేసి పదవి విరమణ అనంతరం ఎటువంటి భద్రత లేకుండా జీవించాల్సిన దుస్థితి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పెన్షన్​ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. లేదంటే తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.