Electricity Employees JAC 'విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె!'

By

Published : Jul 23, 2023, 7:39 PM IST

thumbnail

Electricity workers Press meet: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరణ చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల్లో జేఎల్ఎం గ్రేడ్- 2 ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్​లోని కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‍ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ శాఖలోని పెండింగ్ అంశాలపై పలుమార్లు విన్నవించినా స్పందించలేదని.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 9 వరకు వివిధ దశలలో నిరసన చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు  జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.