SCHOOL VISIT: జగనన్న విద్యాకానుక పుస్తకాల తనిఖీ.. అధికారుల పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం..

By

Published : May 13, 2023, 1:31 PM IST

Updated : May 13, 2023, 4:11 PM IST

thumbnail

SCHOOL VISIT: అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు హైస్కూల్​లో జగనన్న విద్యాకానుక పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుస్తకాలు తక్కువ ఉండడంతో మండల స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల విద్యాశాఖ అధికారిని తన కార్యాలయానికి రావాలంటూ ఆదేశించారు.

అనంతరం పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థుల వరకు రక్తహీనతను కలిగి ఉన్నారని, వారికి ప్రతినెలా ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తున్నారా లేదా అంటూ ఆరాతీశారు. లిస్టులో నుంచి ఆరుగురు పేర్లను గుర్తించి వీరిలో ఒకరి వద్దకు తనను తీసుకెళ్లాలని ఆయన సిబ్బందిని కోరారు. నారాకోడూరులోని తిరుపతమ్మ అనే విద్యార్థి ఇంటికి నేరుగా వెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ.. మందు బిళ్లలు ఇస్తున్నారా? అని అడిగితెలుసుకున్నారు. 

అయితే అధికారులు మాత్రలు ఇచ్చినా ఎందుకు వేసుకోవడం లేదంటూ.. ఆయనే స్వయంగా మాత్రలు తీసి విద్యార్థిని చేత మింగించారు. ఈ బుక్ గురించి విద్యార్థులకు ఎందుకు అవగాహన కల్పించలేదని ఆర్​జేడీ సుబ్బారావును ఆయన ప్రశ్నించారు. 14 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు దాన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓ విద్యార్థినికి ఫోన్ చేయాలని ఆర్​జేడీకి సూచించగా ఫోన్లో బ్యాలెన్స్ లేదని సమాధానం ఇవ్వడంతో.. అది కూడా ప్రభుత్వమే ఇవ్వాలా..?అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ చికాకు పడ్డారు.

Last Updated : May 13, 2023, 4:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.