మత్స్యకారుల వలకు చిక్కిన డ్రోన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 2:03 PM IST

thumbnail

Drone Caught Fisherman Net in Bapatla: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం వద్ద సముద్రంలో చేపల వలకు డ్రోన్ (drone)చిక్కింది. పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో శనివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ డ్రోన్ దొరికింది. వెంటనే  మత్సకారులు మెరైన్ పోలీసుల(Marine Police)కు డ్రోన్ గురించి సమాచారం ఇచ్చారు. మత్స్యకారుల సమాచారంతో పొట్టిసుబ్బయ్య పాలెం వచ్చిన మెరైన్ పోలీసులు డ్రోన్​ పరిశీలించి సూర్యలంక ఎయిర్‌ఫోర్సు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎయిర్‌ఫోర్సు అధికారులు డ్రోన్‌ను పరిశీలించి అది తమదేనంటూ తీసుకెళ్లారు. 

Missiles testing Held in Suryalanka coast: మెరైన్ ఏఎస్ఐ(Assistant Sub inspector) ఆలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో క్షిపణుల (missiles) ప్రయోగం జరుగుతోంది. దీనిలో భాగంగా డ్రోన్‌ను ఎయిర్‌ఫోర్సు అధికారులు ప్రయోగించారు. కొద్దిసేపటికే ఆ డ్రోన్‌ సముద్రంలో పడిపోవడంతో మత్స్యకారుల వలకు చిక్కిందని ఏఎస్ఐ (A.S.I) తెలిపారు. సూర్యలంక ఎయిర్‌ఫోర్సు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు డ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.