Draft Voter list Released in AP: 2024 రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. డిసెంబర్ 27 వరకు అభ్యంతరాల పరిశీలన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 10:22 PM IST

thumbnail

Draft Voter list Released in AP: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూలు ప్రకారం 2024 ఎస్​ఎస్​ఆర్​కు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్​ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లుగా నమోదు అయ్యారని ఆయన వెల్లడించారు. 2023 జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా కంటే 2 లక్షల 36 వేల మంది ఓటర్లు పెరిగారన్నారు. డిసెంబర్ 27 తేదీ వరకూ అభ్యంతరాల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు. 2024 జనవరి 5 తేదీన తుది ఓటర్ల జాబితా వ్రకటిస్తామన్నారు. ప్రస్తుతం యువ ఓటర్ల నమోదు తక్కువగా ఉందని .. ఎక్కువ మంది అర్హులైన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని వివరించారు. గత ఓటర్ల జాబితా ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో.. మొత్తం 13 లక్షల 48 వేల ఓట్లు తొలగించామని.. 15 లక్షల 84 వేల ఓట్లను చేర్చామని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.