చిల్లకూరు వైసీపీలో వర్గ విభేదాలు - వ్యతిరేక వర్గీయుడిపై పలువురు దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 3:34 PM IST

thumbnail

Dispute Between Chillakur YSRCP : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్​డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డిల వ్యతిరేక వర్గీయుడైన రాకేష్‌రెడ్డి (Rakesh Reddy)పై వెలివేత ఆంక్షలు విధించారు. ఎవరూ మాట్లాడవద్దని గ్రామస్థులను ఆదేశించారు. బాధితుడి ఇంటికి ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంకర గుట్టలుగా పోసి రాకపోకలు నిలిపివేశారు.

YSRCP Leaders Attack : ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్​సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవేమీ లెక్క చేయకుండా ఎన్​డీసీసీబీ ఛైర్మన్‌ అనాగరిక చర్యలకు పాల్పడినట్లు తెలిపాడు. తనను అతని ఇంటి ముందు స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడినట్లు బాధితుడు రాకేశ్​రెడ్డి వాపోయాడు. పోలీసులు చూస్తూ నిమ్మకుండిపోయారని మండిపడ్డాడు. తాను ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్​సీపీలో పని చేస్తున్నానని తనపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య (YSRCP MLA Kiliveti Sanjeevaiah) వైఖరి అనాగరికమని బాధితుడు పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.