Undrajavaram Venkateswara Swamy: ఉండ్రాజవరం వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Jun 24, 2023, 3:50 PM IST

thumbnail

 Devotees Crowd at Undrajavaram Venkateswara Swamy Temple: ఉండ్రాజవరం వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అషాడ మాసం భక్తులకు ప్రత్యేకం కావటంతో  ఆలయానికి పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా గల ఉండ్రాజవరంలోని భూ సమేత వేంకటేశ్వర స్వామిని.. అషాడ మాసంలో దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో అషాడ మాసంలోని మొదటి శనివారం పురష్కరించుకుని.. ఈ రోజు ఉదయం నుంచే ఆలయానికి విచ్చేస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రత్యేక అభిషేకాలు చేయిస్తున్నారు. పూజరులు వేంకటేశ స్వామివారిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. తామర పూలతో భారీ పూలమాలలు తయారుచేసి.. వాటితో స్వామి వారిని సర్వంగ సుందరంగా అలంకరించారు.  ఆలయంలో భక్తులకు సిబ్బంది తీర్థప్రసాద వితరణ చేశారు. ఉండ్రాజవరం వెంకటేశ్వర ఆలయాన్ని చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. ఇటీవలే ఈ ఆసయంలో స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట చేసి.. ఆ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.