తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని పర్యటన - రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 6:44 PM IST

thumbnail

Devineni  Suggestions for Crop Damage Farmers due to Impact of Cyclone: దేశానికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో కష్టపడే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. మిగ్‌జాం తుపాను(michaung cyclone) ప్రభావంతో పంటలు.. గాలికి నేలవాలి, నీట మునగడంతో రైతులు పూర్తిగా నష్టపోయారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో దేవినేని పర్యటించారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులకు పలు సూచనలు ఇచ్చారు.

Devine Visit to Michaung Effected Areas: పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమేా ఆదుకోవాలని దేవినేని ఉమా మహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం దెబ్బతిన్న పంటలను, రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో చేనుకు ఇంజన్లతో నీరు పెట్టిన రైతులకు ఎకరానికి రూ.ఐదు నుంచి పదివేల అదనపు ఖర్చు అయిందని తెలియజేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.