CPI Secretary Rama Krishna Fire on Jagan: జగన్​ అధికారం చేపట్టాక.. ప్రతిపక్షాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి: రామకృష్ణ

By

Published : Aug 4, 2023, 10:38 PM IST

thumbnail

CPI Secretary RK reaction On Angallu Attack: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో  కాంగ్రెస్​ శ్రేణులు రాళ్ల దాడి చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటనకు పాల్పడ్డ వారిని తక్షణమే గుర్తించి.. అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు వస్తున్న మార్గంలో వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు భారీ వాహనాలను అడ్డుపెట్టి పర్యటనను అడ్డుకోవాలని చూడటం.. దీనికి పోలీసులు సహకరించడం వారి విపరీత చర్యలకు తార్కాణం అని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన దుండగులను విడిచిపెట్టి.. టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్​ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటి దుందుడుకు చర్యలకు పోలీసులు పాల్పడటాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ వ్యవస్థలో ధర్నాలు, సమావేశాలు, సభలు నిర్వహించుకోవడం సర్వ సాధారణం అని గతంలో జగన్​ కూడా పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు.  జగన్​ అధికారం చేపట్టాక రాష్ట్రంలోప్రతిపక్షాలపై దాడులు, వేధింపులు నిత్యకృత్యమైపోయాయని రామకృష్ణ మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.