అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. మల్లవల్లి పారిశ్రామికవాడ

By

Published : Mar 30, 2023, 7:13 PM IST

Updated : Mar 31, 2023, 6:51 AM IST

thumbnail

MALLAVALLI INDUSTRIAL AREA : వందలాది పరిశ్రమలు, వేలాది కార్మికులతో నిత్యం సందడిగా ఉండాల్సిన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నేడు నిశబ్దం కనిపిస్తోంది. మల్లవల్లి పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వ హయంలోనే భారీ, మధ్య తరహా పరిశ్రమలకు భూములను కేటాయించారు. వాటిల్లో అశోక్ లే ల్యాండ్ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా ప్రారంభించలేదు. అలాగే రైల్ నీర్, పార్లే ఆగ్రో పనులు మందగించాయి. రాజ్​స్టిక్ హబ్ ఊసే లేకుండా పోయింది. ఫుడ్ పార్కులో నిర్మించిన సీపీసీని గతేడాది ప్రారంభిస్తామని హడావుడి చేశారు.. కానీ ప్రారంభించలేదు. చాలా మంది పారిశ్రామిక వేత్తలు తమకు కేటాయించిన భూమిలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ స్థలాలు నేడు పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో వదిలేసిన భవనాలు.. ప్రస్తుతం అసాంఘీక కార్యకలపాలకు అడ్డాలుగా మారాయి. మల్లవల్లి పారిశ్రామికవాడపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు..

Last Updated : Mar 31, 2023, 6:51 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.