ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ - ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 4:43 PM IST

thumbnail

CID Filed Petition in ACB Court in Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో (Fiber net case) నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అక్రమంగా అనుమతులిచ్చారంటూ సీఐడి (CID) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు (Case registered against TDP leader Chandrababu) చేశారు. ఈ కేసులో టెరాసాఫ్ట్ కంపెనీకి (Terasoft Company) సంబంధించిన ఆస్తులను అటాచ్​మెంట్ చేసేందుకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. ఏడు ఆస్తులను అటాచ్​మెంట్ చేస్తున్నట్లు సీఐడి అధికారులు పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అనుమతించింది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఐడీకి అనుమతి ఇచ్చింది. గతంలో చంద్రబాబుపై స్కిల్​ డెెవలప్​మెంట్​ కేసు నమోదు అవ్వగా ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెయిలు మంజూరు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.